Wednesday, April 21, 2021

Latest Posts

టీడీపీ ఎమ్మెల్యే కి హై కోర్టు నోటీసులు..!!

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది.

అయితే తాజాగా టెక్కలి నుంచి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే కింజ‌ర‌పు అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అయితే ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడు అందించిన అఫిడ‌విట్‌లో త‌న‌పై నమోదైన కేసు వివ‌రాల‌ను పేర్కొన‌లేద‌ని, ఆయ‌న ఎన్నిక చెల్ల‌దంటూ వైసీపీ అభ్య‌ర్ధి పేరాడ తిల‌క్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్ట్ దీనిపై వివరణ కోరుతూ అచ్చెన్నాయుడు, టెక్క‌లి ఎన్నికల రిట‌ర్నింగ్ అధికారితో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss