Tuesday, April 13, 2021

Latest Posts

హైకోర్టులో ఇంగ్లీష్ మీడియంకు చుక్కఎదురు

High court rejected GO for English medium compulsory

ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుదవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జీఓ నెం.81, 85 లను కొట్టివేస్తునట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది.   దీంతో మరో సారి జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ  తగిలింది.

ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని ప్రభుత్వాల నిర్ణయెంచు కూడదని అది విద్యారంగం ధిక్కరణ కిందికి వస్తుందని అన్న వాదనలను విన్న తరువాత హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇంకా  ప్రభుత్వ జీఓను సవాలు చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ సైతం పిల్ దాఖలు చేశారు. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్‌లు మిగిలిపోయే ప్రమాదం ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీఓలను కొట్టేస్తూ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss