Thursday, December 2, 2021

Latest Posts

స్వేచ్చా భారతావనికి 75 ఏళ్ళు

History Of India Independence

భారతీయ స్వాతంత్ర్య యోదుల పోరాటాల ఫలంగా దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. అసలు ఏంటి ఈ స్వాతంత్ర్య. ఇప్పుడు ఉన్న ప్రజలలో చాలామందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియక పోయి ఉండవచ్చు. ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన ఈ స్వాతంత్ర్య వల్ల మనం ఎక్కడి వెళ్ళలంటే అక్కడకు వెళ్ళ గాలుగుతున్నాం, ఏది మాట్లాడాలంటే అది మాట్లాడుతున్నాం, ఎం చెయ్యాలంటే అది చేస్తున్నాము. కానీ 75 సంవత్సరాల క్రితం అలా లేదని కొందరికి మాత్రమే తెలుసు.

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. ఎంతో మంది రాజులూ ఏలిన దేశాన్ని వ్యాపారం పేరుతో వచ్చి ఆధిపత్యపోరుకు దిగి భరత భుబాగాన్ని వారి చెప్పు చేతలలో పెట్టుకున్నారు.  1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళలోనే భారత దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు.

1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. అప్పటి నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం తిసుకోచేందుకు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేపట్టారు. సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం,  భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా ఉద్యమం, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల చేశారు. ఆ పోరాటాల్లో ఎంతో మంది విర మరణం పొందారు. చివరకు వారి ప్రాణత్యాగాలు ఫలించి భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విముక్తి పొందింది.  మనం ఇప్పడు అనుభవిస్తున్న స్వేచ్చా, స్వాతంత్ర్య వారు ఇచ్చినవే. వారిని స్మరించు కుంటూ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుందాం జై హింద్.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss