Sunday, May 16, 2021

Latest Posts

హాలీవుడ్ స్టార్స్ కి కరోనా ..

POPULAR HOLLYWOOD STAR COUPLE TOM HANKS AND WIFE AFFECTED BY CORONA

వాళ్ళూ వీల్లో అనేది తేడా లేకుండా కరోనా అందరినీ సోకుతోంది. తాజాగా అమెరికా దేశంలోని హాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ నటులకు కరోనా వైరస్ సోకింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు ఇడ్రిస్ ఎల్బాకు కరోనా వైరస్ సోకింది. ‘‘ నాకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. నాలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించక పోయినా పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో నేను ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నాను. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి’’ అంటూ హాలివుడ్ నటుడు ఇడ్రిస్ ఎల్బా ట్వీట్ చేశారు.

ఈమేరకు తన భర్యా సబ్రినా దోవ్రీతో కలిసి ఉన్న వీడియో కూడా ఇడ్రిస్ విడుదల చేశారు. ’’కరోనా వైరస్ ప్రబలుతుండటం చాలా తీవ్రంగా పరిగణించాలి. అందరూ జనసమూహాలకు దూరంగా ఉండటంతోపాటు చేతులు కడుక్కోవాలి. మీరు అనారోగ్యానికి గురైతే వెంటనే పరీక్ష చేయించుకోండి’’ అని ఇడ్రిస్ సూచించారు.అలాగే హాలీవుడ్ మరో నటుడు క్రిస్టోఫర్ హివుజుకు కూడా కరోనా వైరస్ సోకింది.

తనకు కూడా కరోనా వైరస్ సోకడంతో తాను నార్వే దేశంలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నానని గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ క్రిస్టోఫర్ చెప్పారు. ప్రజలందరూ చేతులు కడుగుకుంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని నటుడు క్రిస్టోఫర్ సలహా ఇచ్చారు. ప్రజలు ఒకరికి మరొకరు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss