దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే 7వ తేదీ నుంచి మద్యం విక్రయించడం మొదలు పెట్టారు. అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తమిళనాడులో కూడా తెరిచారు. కానీ మద్యం దుకాణాలు తెరవగానే జనం సామాజిక దూరాన్ని ఏమాత్రం పాటించకుండా పెద్దఎత్తున బారులు తీరడం, నిబంధనలను తుంగలోకి తొక్కడంతో కోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం మూసేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 7 నుంచి వైన్ దుకాణాలు తిరిగి తెరుస్తున్నట్టు తెలవగానే ఆ జీవో ను సవాలు చేస్తూ పలువురు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు.
దాంతో జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ పుష్పా సత్యనారాయణలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక బెంచ్ వాదనలు విన్న తర్వాత ఈ రోజు ఒక తీర్పు ను వెలువరించింది. లాక్డౌన్ ఎత్తేసేంత వరకు మద్యం దుకాణాలు మూసేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే,ఆన్లైన్, హోం డెలివరీ పద్ధతుల్లో మద్యం అమ్మకాలకు కోర్టు అనుమతి ఇచ్చింది.