Thursday, December 2, 2021

Latest Posts

హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్షవిదించిన నాంపల్లి కోర్టు

Homeguard sentenced to 30 years in prison

లైంగిక దాడి కేసులో నిందితుడైన హోంగార్డు మల్లికార్జున్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది నాంపల్లి కోర్టు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి పాల్పడినందుకు మల్లికార్జున్‌కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలుశిక్షతో పాటు బాధితురాలి కుటుంబానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకారాంగేట్‌ వద్ద మైనర్‌ బాలికపై మల్లికార్జున్‌ అత్యాచారానికి పాల్పడ్డాటంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 19న అతన్ని అరెస్ట్‌ చేశారు. అనంతరం బాలిక గర్భం దాల్చడంతో మెడికల్‌ రిపోర్ట్స్‌ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ వరకు అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో సమర్పించారు. వీటన్నింటిని పరిశీలించిన కోర్టు ఈ రోజు ఈ తీర్పును వెల్లడించింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss