ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తొందర పడ్డారు. అనారోగ్యంతో రామ్ బాబు (66) అనే వ్యక్తి మే 7 న ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మరణించారు. అతనికి COVID-19 టెస్ట్ చేయగా నెగటివ్ రావడంతో, హాస్పిటల్ సిబ్బంది మృత దేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాల్సి వచ్చింది. అయితే ఈ ప్రక్రియలోనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఆ మృత దేహానికి బదులు అదే ఆసుపత్రిలో కోవిడ్ 19 తో చనిపోయిన రామ్ రెడ్డి అనే వ్యక్తి మృత దేహాన్ని ఇవ్వడం జరిగింది.
రామ్ బాబు (66) బంధువులు అతని మృతదేహాన్ని సేకరించడానికి కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (జిజిహెచ్) వచ్చినప్పుడు తమకు అప్పగించిన శరీరం రామ్ బాబు కాదని వారు కనుగొన్నారు ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రామ్ బాబు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. కాగా ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులతో జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: కర్నూల్ లో కేంద్ర బృందం