Home వైరల్ ఈ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌కు గంట అవకాశం

ఈ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌కు గంట అవకాశం

hour opportunity to download e-EP card

hour opportunity to download e-EP card

హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొత్తగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న పౌరులు ఈ-ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ తెలిపింది. సర్వర్‌పై లోడ్‌ టెస్ట్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా గంటపాటు ఈ-ఎపిక్‌ కార్డుల డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించడంతో జీహెచ్‌ఎంసీ ఈ ప్రేకటన చేసింది. కాగా శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ-ఎపిక్ కార్డు ను డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించింది జీహెచ్‌ఎంసీ.

ఓటర్‌ నమోదు సందర్భంగా ఈ ఫోన్ నెంబర్ ఐతే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్‌తో ఈ-ఎపిక్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారు గంట వ్యవధిలో ముగిసే ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నమోదు ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ)ను సంప్రదించాలని తెలిపారు. www.nvsp.in వెబ్‌సైట్‌ లేదా votershelpline యాప్‌ ద్వారా ఈ-ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Exit mobile version