Sunday, June 20, 2021

Latest Posts

బ్లాక్ ఫంగస్ రాకకు అసలు కారణం ఇదట

How Did Black Fungus Occur

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీనిని కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. రోజుకో సిద్ధాంతం తో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. ఇంకా దీని నుంచి ఉపశమనం లభించకుండానే కరోనా వైరస్ కు అనుబంధంగా బయటకు వచ్చిన బ్లాక్ ఫంగస్ పరిస్థితి కూడా అలానే ఉంది.

నిన్నటి వరకు కరోనా వైరస్ ట్రీట్ మెంట్ లో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల, డయాబిటిక్ పేషెంట్లకు గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో లేకపోవడం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందని అన్నారు. అంతే కాదు మాస్కులు మార్చుకుండా వాడడం వల్ల కూడా ఈ ఫంగస్ వస్తుందని చెప్పారు. తాజాగా ఇండోర్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ జయదేవన్ 200 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లపై పరిశోధన చేసారు. చిత్రంగా వీరిలో 42 మందికి డయాబెటీస్ లేదు. 28 మంది స్టెరాయిడ్స్ వాడలేదు. 72 మంది ఆక్సిజన్ తీసుకోలేదు. 110 మంది మాత్రమే ఆక్సిజన్ తీసుకున్నారు.

గమ్మత్తేమిటంటే ఈ పేషెంట్లు అందరూ యాంటీ బయాటిక్స్ వాడిన వారే. అంటే ఇప్పుడు కొత్త అనుమానం ఏమిటంటే డయాబెటిక్స్, స్టెరాయిడ్స్, ఆక్సిజన్ వినియోగం కన్నా యాంటీ బయాటిక్స్ వినియోగం వల్ల బ్లాక్ ఫంగస్ సోకిందని. మరి ఇదైనా సరైన కారణమని చెప్పొచ్చా లేక రేపు మరో కొత్త రకమైన రీజన్లు, లాజిక్ లు బయటకు వస్తాయా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss