Thursday, January 21, 2021

Latest Posts

చైనాలో ఎంతమంది కరోనా కాటుకు బలయ్యారో తెలుసా

how many people in China are affected by coronavirus bites:

మొదటి నుంచి చైనా లో కరోనా మరణాలపై అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడో నిజం దాస్తున్నారన్న మాటా వినిపిస్తోంది. అయితే   చైనాలోని ఉహాన్ వాసులు తమ నగరంలోనే ఏకంగా 42 వేలమంది కరోనా వైరస్ కారణంగా మరణించారని అంటున్నారు. కానీ  కరోనా వైరస్ కారణంగా చైనా మొత్తం మీద కేవలం 3300 మంది మాత్రమే మరణించారని చైనా ప్రభుత్వం చెబుతోంది.

ఇక  మీడియాకు అందిన సమాచారం ప్రకారం మృతుల గురించి  సమగ్రంగా దర్యాప్తు జరగలేదని,  లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే  మరణించారని టాక్ వినిపిస్తోంది. ఒక్క నెలలోనే 28 వేల మృతదేహాలను దహనం చేశారనే వార్తలు వినిపించాయి. చైనా అధికారులు ఇచ్చిన గణాంకాల కంటే ఉహాన్ ప్రజలు చెబుతున్న మృతుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ. ప్రపంచమంతటినీ వణికిస్తున్న కరోనా వైరస్ సంక్రమణ చైనాలోని ఉహాన్ లో ప్రారంభమైంది.

కాగా మృతులకు సంబంధించి ప్రతిరోజూ 500 ఆస్తికల కలశాలను బంధువులకు ఇస్తున్నట్లు వుహాన్‌లో నివసిస్తున్న ప్రజలు చెబుతున్నారు. ఇలా 7 అంత్యక్రియల గృహాల నుంచి  ప్రతిరోజూ సుమారు 3500 మందికి  అస్తికలు కలశాలను ఇస్తున్నారు.ఈ విధంగా 12 రోజుల్లో 42 వేల అస్తికలు కలశాలను వారి బంధువులకు అందజేయనున్నారని వినిపిస్తోంది. మొత్తానికి చైనాలో మరణాలపై వాస్తవం బయటకు రావడం లేదన్నది వరల్డ్ వైడ్ అనుమానంగా ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss