Sunday, February 28, 2021

Latest Posts

హైదరాబాద్ బాచుపల్లి కెమికల్ ఇండ్రస్ట్రి లో భారీ పేలుడు

హైదరాబాద్ బాచుపల్లి కెమికల్ ఇండ్రస్ట్రి లో భారీ పేలుడు సంభవించింది. ఐడీఏ బొల్లారంలోని గల పి‌ఎన్‌ఎం  కెమికల్స్  ఫ్యాక్టరీలో ఉన్నటుండి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగ వారిని హుటా హుటినా దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జిన్నారం మండలంలోని ఐడిఎ బొల్లారంలోని పీఎన్ఎం కెమికల్స్  ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగడంతో పేలుడు సంభవించగా దాదాపు 5 కిలో మీటర్ల మేర దాని ప్రకంపనలు సంభవించాయి.

దాంతో అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు బయాందోళనకు గురియయ్యారు. రియాక్టర్ పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss