Home వైరల్ జల కళతో ప్రవహిస్తున్న ప్రాజెక్టులు

జల కళతో ప్రవహిస్తున్న ప్రాజెక్టులు

99telugu, Huge Flood Water Inflow To Projects In Telugu States, Huge Water Inflow Into Jurala And Pulichintala Projects, Huge Water Inflow To Jurala Project, NAGARJUNA SAGAR Latest News, PULICHINTHALA PROJECT Latest News

Huge Flood Water Inflow To Projects In Telugu States

వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రాజెక్టులు అన్ని జల కళతో కల కల లాడుతున్నాయి. వరద ప్రవాహం ఉండటంతో ప్రాజెక్ట్  గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.  నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వల్ల 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 81,798 క్యూసెక్కులు కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుకాగా ప్రస్తుతం 310.8498 టీఎంసీలుగా, పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులుగా ఉంది.

అలాగే జూరాల ప్రాజెక్ట్‌కు వద్ద కూడా వరద ప్రవాహం పెరగడంతో అధికారులు ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 92,100 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 93,096 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, 8.145 టీఎంసీలు ప్రస్తుతం ఉండగా, నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉండగా 317.760 మీటర్లు ప్రస్తుతం ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు వద్ద కూడా అదే పరిస్థితి నేలకుంది. పులిచింతల ఇన్ ఫ్లో : 80,587 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో : 15,372 క్యూసెక్కులుగా ఉన్నది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం  16.49 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులుగా, ప్రస్తుతం 151.146 అడుగులుగా ఉంది.

ఇది కూడా చదవండి:   

Exit mobile version