Wednesday, January 19, 2022

Latest Posts

భారీ నష్టంతో సి‌ఎం సహాయం కోరిన మెట్రో

Huge Losses For Hyderabad Metro

కరోనా వైరస్ హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ నష్టాలను మిగిల్చింది. దీనితో ఇప్పుడు మెట్రో రైలు సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించింది. మార్చి 2020 లో లాక్డౌన్ చేయడానికి ముందు, హైదరాబాద్ మెట్రో రోజుకు రూ .8 కోట్లు సంపాదించేది. కానీ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాల కోసం హైదరాబాద్ మెట్రో అథారిటీ ప్రతి నెలా రూ.50 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు చెప్పింది.

మొదటి లాక్‌డౌన్‌లో మెట్రోకు రూ .200 కోట్ల నష్టం వాటిల్లింది. సెప్టెంబర్ 2020 నుండి, మెట్రో తిరిగి ప్రారంభమయ్యినప్పటికీ ప్రయాణికుల పై ఆంక్షలు ఉండడంతో ప్రజలు వాటికి కాస్త దూరంగా ఉన్నారు. అప్పటి నుండి హైదరాబాద్ మెట్రో రోజుకి కేవలం కోటి రూపాయిలు మాత్రమే ఆదాయం సాధిస్తుంది.

తాజాగా జరిగిన సెకండ్ లాక్డౌన్ వల్ల ఎల్ అండ్ టి సంస్థ, ఏప్రిల్ నుండి జూన్ వరకు 400 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది, ఇది మొదటి వేవ్ కంటే రెట్టింపు కావడం విశేషం. రెండవ వేవ్ తరువాత, మెట్రో రోజుకు 5 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటోంది. దీనితో ఎల్ అండ్ టి తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించింది. మెట్రో అథారిటీ సంస్థ ఎల్ అండ్ టి ఇటీవల సిఎం కెసిఆర్‌ను కలుసుకుని సహాయం కోరింది.

మెట్రోను అభివృద్ధి చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎల్ అండ్ టి మధ్య ఒప్పందం ప్రకారం ప్రోత్సాహక ప్రణాళికలో నివేదికను సిద్ధం చేయాలని సిఎం కెసిఆర్ ఎల్ అండ్ టి మరియు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. మెట్రో పునరుద్ధరణ ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. వైరస్ పూర్తిగా పోతే గాని, మెట్రోకు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss