Thursday, May 13, 2021

Latest Posts

మరోసారి కరోనా కట్లపాము పడగెత్తుతుంది

hungary prime minister viktor orban comments on coronavirus

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశం ఉందని హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ హెచ్చరించారు. వేసవికాలంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గినా ఆ తర్వాత అక్టోబరు-నవంబరు మాసాల్లో కరోనా కట్లపాము మరోసారి పడగెత్తే అవకాశముందని ఆయన విశ్లేషించారు. అలాగే బుడాపెస్ట్, దాని పరిసర ప్రాంతాల్లో మరణాల రేటు తగ్గేవరకు ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఉండవని తేల్చిచెప్పారు.దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో 80శాతం ఈ ప్రాంతాల్లోనే జరిగాయని, ఈ కారణంగానే ఇక్కడ లాక్‌డౌన్ సడలింపులు అప్పుడే సాధ్యంకాదని ఆయన తేల్చి చెప్పారు.

మరోపక్క కరోనా మహమ్మారిని చైనా కావాలనే తయారు చేసిందనడానికి ఆధారాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. వూహాన్‌లోని చైనీస్ ల్యాబొరేటరీల్లోనే కరోనా వైరస్‌ను తయారు చేశారని సూచించే ఆధారాలను తాను చూసినట్లు తెలిపారు. అయితే దీనిపై పూర్తి వివరాలు వెల్లడించడానికి ఆయన అంగీకరించలేదు. తను అప్పుడే ఆ వివరాలు వెల్లడించలేనంటూ సమాధానం దాటవేశారు. అయితే ఇటీవలే యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు కరోనాను ఎవరూ తయారుచేయలేదంటూ ప్రకటించాయి. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దీనికి పూర్తి విరుద్దంగా ఉండటం కాక రేపుతోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss