Sunday, June 20, 2021

Latest Posts

మరోసారి తెర మీదకి వచ్చిన ఉమ్మడి రాజధాని అంశం

Hyderabad Joint Capital Issue:

తెలంగాణ పోలీసులు చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంబులెన్సులను ఆపడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఈరోజు ఉదయం తెలంగాణ పోలీసులు ఏకంగా 20 అంబులెన్సులను అడ్డుకున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఇద్దరు రోగులు మృతి చెందారు.

దీనితో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వాళ్ల ప్రజల క్షేమం గురించి ఆలోచించడం సహజమేనని, అయితే మానవత్వంతో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించాలని కోరారు. 2024 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అనే విషయాన్ని మర్చిపోకూడదని చెప్పారు. అనుమతించకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు.

ఇక ఎంపీ రఘు రామ కృష్ణం రాజు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని దీనిని పరిష్కరించాలని చెప్పారు. మూడు రాజధానులు అంటూ ఏపీకి క్యాపిటల్ లేకుండా పోయింది. అయినప్పటికీ హైదరాబాద్ 2024 వరకు కామన్ క్యాపిటల్, అని ఆయన అన్నారు. అవసరమైతే మా రాజధాని రగడ ముగిసేవరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఇంకో ఐదేళ్ల పాటు కొనసాగించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేస్తా, అలా కుదరకపోతే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేసి రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని కోరుతా అన్నారు.

అయితే జనాలు ఎప్పుడో మర్చిపోయిన ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం వంటి అంశాలు కేవలం కేసీఆర్ వల్లే తిరిగి తెరమీదకు వచ్చాయని తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss