Monday, July 26, 2021

Latest Posts

ఆర్ నారాయణ మూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad Police Arrest R Narayana Murthy

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఆర్ నారాయణ మూర్తిని ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే వారి ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లోని ఛలో రాజ్ భవన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులకు మద్దతుగా ఆర్ నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు .

అయితే రాజ్ భవన్ కు వెళ్లడానికి వారి వద్ద అనుమతి లేనందున పోలీసులు రైతులను అడ్డుకున్నారు. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు కోరగా రైతులు అందుకు నిరాకరించారు. దీనితో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ అయిన వారిలో నటుడు ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నారని తెలిసింది.

ఈ క్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆయన అన్నారు. 2006వ సంవత్సరంలో బీహార్ లో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారు. ఆ చట్టాల కారణంగా అక్కడ రైతులు అనేవారు లేకుండా అయ్యిందని, చివరికి వారు కూలీలుగా మారారని తెలిపారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఇక్కడ కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి ప్రభుత్వం ఇలాంటి చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వ్యవసాయం, విద్య, వైద్యాన్ని ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఆర్ నారాయణమూర్తి సూచించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss