Thursday, May 13, 2021

Latest Posts

హైదరాబాద్‌లో మొదలైన హడావిడి

దాదాపు రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో హడావిడి మొదలైంది. ఎప్పుడు జనలతో రద్ధిగా ఉండే హైదరాబాద్ లాక్ డౌన్ కరణమగా దాదాపు రెండు నెలలు మూతపడ్డాయి.  లాక్ డౌన్ తో మూయబడిన షాప్ లు ఇప్పుడు రెడ్‌ జోన్‌లో ఉన్న హైదరాబాద్‌లో ఆంక్షలతో కూడిన సడలింపు నేపథ్యంలో చాలాకాలం తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి.  అయితే  వాటిని సరి, బేసి విధానంలో రోజు విడిచి రోజు షాపులు తెరుచుకోవచ్చన్న ప్రభుత్వ సూచన మేరకు జీహెచ్‌ఎంసీ వారు  విధివిధానాలు ఖరారు చేసింది.  వారు క్రమపద్ధతిలో దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని జోనల్‌, డిప్యూటీ కమిషనర్లను ఆదేశిస్తూ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: జూనియర్ ఎన్‌టి‌ఆర్ పై మత్తెకించే కామెంట్స్ చేసిన రాంగోపాల్ వర్మ

అయితే ఖచ్చితంగా నిబంధనలు పాటించేలా చూడాలని,  అలాగే  ఏ దుకాణం ఏ రోజు తెరవాలన్న దానిపై యజమానుల మధ్య వివాదం  ఉన్నట్లు అయితే  ఆ షాపులను యాజమానులు  లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ మూసివేయాలని స్పష్టం చేశారు. తెరిచిన దుకాణాల్లో వ్యాపారులు, సిబ్బంది, కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించడం, మాస్క లు ధరించడం తదితర నిబంధనలు పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. రెస్టారెంట్లలో మాత్రం ఆర్డర్‌పై ఇంటికి ఆహారం తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కట్టడి ప్రాంతాల్లో ఏ దుకాణాలూ తెరవడానికి వీల్లేదు. అయితే  ఈ నిబంధనలు కేవలం  ఈ ెల 31 వరకూ  మాత్రమే వర్తిస్తాయని కమిషనర్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: కేంద్రం 20 లక్షల ప్యాకేజీపై ఏ‌పి విధి విధానాలు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss