హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన “తేజస్” విమానాలు త్వరలో భారత వైమానిక దళంలో చేరనున్నాయి. మొత్తంగా 83 తేజస్ విమానాలను ఈ సంస్థ ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసింది. త్వరలోనే వీటిని ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయనుంది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విమానాలు హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. దీనికి గాను ఇంతక ముందే ఒప్పందం కుదుర్చుకున్న భారత వైమానిక దళం హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ సంష్ట పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో తయారు చేయబడిన విమానాలను కొనుగోలు చేయనున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ రావత్ తెలిపారు.
కాగా ఇందులో నలభై విమానాలను కొనుగోలు చేయ్యదానికి ముందు చేసుకున్న ఒప్పందంతో పాటు 6 మిలియన్ డాలర్ల ఖర్చు అదనంగా అవుతుంది అన్నారు. జెట్ లతో పాటు, ఆర్టిలరీ గన్స్, వైమానిక రక్షణ వ్యవస్థ రాడార్ లను కూడా స్వదేశీయంగానే తయారు చేసి ఉత్పత్తి చేయనున్నట్టు రావత్ తెలిపారు.
ఇది కూడా చదవండి: సైన్యంలోకి యువత!