Wednesday, December 1, 2021

Latest Posts

ఐ‌ఏ‌ఎస్ టాపర్స్ కి విడాకులు ముంజూరు చేసిన కోర్టు

IAS Toppers Tina Dabi Athar Khan Got Divorce

ఇద్దరు ఐ‌ఏ‌ఎస్ అధికారులు, టీనా డాబీ మరియు అథర్ ఖాన్ లకు జైపూర్‌ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. గత సంవత్సరం నవంబర్‌లో, వీరిద్దరు విడాకుల కోసం జైపూర్‌ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. 2015 ఐ‌ఏ‌ఎస్ పరీక్షలలో టీనా డాబీ మరియు అథర్ ఖాన్ టాప్ రాంక్ లను సాధించారు. వీరిద్దరికీ 1, 2 ర్యాంకులు రావడం విశేషం.

సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులైన మొదటి దళితురాలిగా డాబీ చరిత్ర సృష్టించారు. టీనా డాబీ మొదటి స్థానంలో, కాశ్మీర్‌కు చెందిన అథర్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. ఏప్రిల్ 7, 2018 న, వారు జమ్మూ కాశ్మీర్ లో వివాహం చేసుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మరియు ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు మరియు ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఇప్పుడు వీరిద్దరికీ బేధాభిప్రాయాలు రావడంతో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss