Sunday, June 13, 2021

Latest Posts

చైనా టెస్టింగ్ కిట్స్‌ను వాడొద్దంటున్న ఐసీఎమ్ఆర్

ICMR said dont use china testing kits

ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల ఖచ్చితత్వంపై కొన్ని రోజుల క్రితం కొన్ని రాష్ట్రాలు సందేహాలు వ్యక్తం చేశాయి. అందువల్ల వాటిని కొన్ని రోజులు ఉపయోగించవద్దని  భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా టెస్టింగ్ కిట్స్‌ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా రూపొందించిన కరోనా టెస్టింగ్ కిట్స్ లో లోపాలు ఉండటంతో వాటిని తిరిగి చైనా పంపించాలని ICMRనిర్ణయించింది. ఈ కిట్స్‌ను రాష్ట్రాలు వాడొద్దని ఉన్నవాటిని వెనక్కి పంపాలని ICMR సూచించింది.

ICMR ఉచితంగా పంపించిన చైనా కిట్లు సత్ఫలితాలివ్వడం లేదంటూ రాజస్థాన్ మొదట చెప్పగా తర్వాత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కూడా ఆదే అబిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దాంతో కేంద్రం వాటి నాణ్యతను పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించింది. వీటిని పరిశీలించిన కమిటీ ఈ కిట్లను రెండు రోజులపాటు వినియోగించవద్దంటూ మొదట సిఫారసు చేసింది. తాజాగా ఇప్పుడు కమిటీ అసలు చైనా కిట్లు వాడొద్దంటూ ICMR నిర్ణయించింది. రాష్ట్రాలను కూడా ఆ కిట్లను తిప్పి పంపాలని ఆదేశించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss