Thursday, May 13, 2021

Latest Posts

అలా చేశారో,జూన్ కల్లా కరోనా హుష్ కాకి ..

ప్రస్తుతం ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న కోరినా వైరస్ ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూ,విస్తరిస్తోంది.  అయితే చైనాకు చెందిన సీనియర్ మెడికల్ అడ్వైజర్ ఝోంగ్ నాన్షన్ తజాగా ఓ స్టేట్ మెంట్ ఇస్తూ,ప్రపంచ  దేశాలన్నీ కలిసి కరోనా మహమ్మారిపై పోరాడితే జూన్ తర్వాత ఈ ప్రాణాంతక వైరస్ అంతం అవుతుందని  ప్రకటించాడు. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన హుబేయి ప్రావిన్స్‌లో కొత్త కేసుల నమోదు ఇప్పుడు తొలిసారి సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో రెండింట మూడొంతులు సెంట్రల్ హుబేయి ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి.

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు ఇక్కడ కొత్త కేసుల నమోదు క్రమంగా తగ్గి సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. అయితే, ఇప్పుడు చైనా వెలుపల ఈ వైరస్ విజృంభిస్తోంది.ఈ విషయంలో అధికారులు చేసిన కృషి ప్రశంసలు అందుకుంటోంది. హుబేయిని దిగ్బంధించడంతో ఇతర నగరాలకు వైరస్ వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో ఇతర దేశాలు తమను ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

‘‘మొత్తంమీద ఇదొక అంటువ్యాధి. ఇది చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు కొత్త కేసుల నమోదు గణనీయంగా పడిపోయింది’ అని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ చెబుతున్నారు.  ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని తీవ్రంగా పరిగణించి కట్టడికి చర్యలు తీసుకునే వరకు ఇది విస్తరిస్తూనే ఉంటుందని ఝోంగ్ నాన్షన్ చెబుతూ,  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచలను అన్ని దేశాలు పాటించాలని సూచించారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss