Saturday, January 16, 2021

Latest Posts

సిత్తరాల పాట రాసిందెవరో తెలిస్తే షాకవుతారు

   అల్లు అర్జున్ హీరోగా   మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన   అల వైకుంఠపురములో మూవీ ఆడియన్స్ ఆకర్షణతో దూసుకెళ్తోంది. ఇందులోని  అన్ని పాటలు హిట్. తమన్ మ్యూజిక్ మంచి హైలెట్ అయింది.  ముఖ్యంగా క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ లో రాసిన గీతం బాగా ఆకట్టుకుంది. అయితే దీనివెనుక చాలా కథే ఉంది.  శీకాకుళం యాసతో  సిత్తరాల అంటూ చాలానే ఛమత్కారంగా రాసిన ఈ  జానపద గేయం చాలా పాపులర్ అయింది.  ప్రస్తుతం అతడి పేరు ఇంటా బయటా మార్మోగుతోంది.  మరి  ఈ సాంగ్ రాశారంటే,  ఈ పాట శ్రీకాకుళం- ఒడిస్సా బార్డర్ వ్యక్తట.  ఎల్ ఐసీ సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్ రాసిన పాట ఇది.

      ఇంతకీ విజయకుమార్ నేపథ్యం లోకి వెళ్తే, ఒడిషాలోని జయపూర్ లో ఉంటారు.  ‘ఎల్ ఐసీలో ఉద్యోగ రీత్యా నాగావళి నుంచి వంశధార వరకు తిరిగాను. . ప్రస్తుతం మచిలీపట్నం ఎల్ ఐసీ డివిజన్ కార్యాలయంలో ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీలో మేనేజర్ గా పనిచేస్తున్నా’అని విజయకుమార్ వెల్లడించారు. ‘గజల్స్- జానపద గేయాలంటే చాలా ఇష్టం. ఎల్ ఐసీ నన్ను ఊరూరా తిప్పి అక్కడి జనపదాలను పరిచయం చేసింది. శ్రీకాకుళం- రాజాం- విజయనగరం- విజయవాడ- గాజువాక- వరంగల్ లో పనిచేశా’అని తెలిపారు.

   ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చిన్నచిన్నగా రాసిస్తుంటానని, ఈ క్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు సీవీఆర్ శాస్త్రిగారితో మంచి అనుబంధం ఏర్పడింద ని విజయకుమార్ చెప్పారు.  ‘హుద్ హుద్ తుపాను సమయంలో నేను రాసిన సంకల్ప్ గీతం ఆయనకు బాగా ఇష్టం. అందువల్ల అల వైకుంఠపురంలో శ్రీకాకుళం యాసలో జానపద గేయం కావాలని దర్శకుడు త్రివిక్రమ్ తన టీంతో ఆరా తీస్తుంటే, సీవీఆర్ శాస్త్రి  నా గురించి త్రివిక్రమ్ గారికి చెప్పారంట. ఆయన తన టీంతో శ్రీకాకుళంలో బాగా ప్రజాదరణ పొందిన జానపద గేయాలు అన్వేషించమని కోరారు. అలా జానపదాల పరిశోధకులు భద్రి కూర్మారావు, రేలరేల జానకిరావుతోపాటు చాలా మందికి ఈ విషయాన్ని చెప్పాను. రకరకాలు పరిశీలించి  చివరికి పల్లవి.. ఏడెనిమిది చరణాలు రాసిచ్చాను. అది సిత్తరాల పాటగా పాపులరైంది’ అని విజయ్ కుమార్ వివరించారు.    

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss