Monday, May 10, 2021

Latest Posts

కరోనా వాక్సిన్ తయారీలో ఇతర దేశాలతో భారత్ పోటీ

India competes with other countries in the manufacture of corona vaccine

ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19 కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు ప్రయత్నాలు  చేస్తున్నాయి. అలాగే భారత్‌లో కూడా ఈ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఆరు సంస్థలు ప్రయాతిస్తున్నాయి. కానీ వాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి కారణం కోవిడ్కు  వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని. వాటిని ఎదుర్కొని దాని విరుగుడు కనిపెట్టవలసి వస్తుందని తెలిపారు. వాటిననీటిని అధిగమించి వ్యాక్సిన్ కనిపెట్టిన అది అన్ని వయస్సుల వారిపై  పని చేస్తుందా? లేదా జన్యు నిర్మాణాన్ని మార్చుకునే క్రమంలో దాన్ని ఎదుర్కోగలదా? వంటి సమస్యలు తలెత్తుతాయని రాజీవ్‌గాంధీ జీవ సాంకేతిక కేంద్రంలోని శాస్త్రవేత్త శ్రీకుమార్ చెబుతున్నారు.

భారత్ లో జైడస్ కాడిలా రెండు వ్యాక్సిన్‌లపై ప్రయోగాలు చేస్తోంది. అలాగే సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, మైన్‌ వ్యాక్స్ లాంటి ఆరు సంస్థలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయని గగన్‌దీప్ కాంగ్, టీహెచ్‌ఎస్‌టీఐ పేర్కొన్నారు. ప్రపంచంలో 70 సంస్థలు వ్యాక్సిన్ తయారీపై కృషి చేస్తునట్లు డబ్ల్యూహెచ్‌వో జాబితాలో ఉన్నాయి. వాటిలో భారత్ నుండి  జైడస్ కాడిలా, సీరమ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. మన లాగే అమెరికా, చైనా కూడా వ్యాక్సిన్‌ని తయారు చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని రకాల వ్యాక్సిన్‌లు తయారు చేసి జంతువులపై, కొన్ని సంస్థలు మనుషులపై ప్రయోగించాయి. అయితే అవి అంతగా ఫలితాలు ఇవ్వలేదని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss