ఇండియాలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. కాగా భారత దేశంలో కరోనా రికవరీ రేట్ కూడా పెరుగుతుండటం కొంత ఊరటనిచ్చే అంశం. భారతదేశంలో ఇప్పటివరకు 1,06,700 కేసులు నమోదు కాగా, కరోనా మరణాల సంఖ్య 3,300 గా ఉన్నాయి.దేశంలో కరోనాతో ఇప్పటివరకు కోలుకున్నవారు 42 వేల మంది ఉన్నారు. భారత్ లో రికవరీ రేట్ 39.62% ఉండగా మరణాలు 0.2 శాతంగా ఉండటం ఊరట కలిగించే విషయం.
దేశంలో ప్రస్తుతం 61,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలియచేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ లక్ష మందిలో 62 మందికి కరోనా ఉండగా, మన దేశంలో 7.2 కేసులు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో లక్షకు 4.2శాతం మంది కరోనాతో చనిపోతుంటే మన దేశంలో 0.2 శాతం మంది మాత్రమే మరణిస్తున్నారని తెలియచేసారు. మొదటి లాక్ డౌన్ విధించినపుడు దేశంలో రికవరీ 7.1% ఉండగా, రెండవ లాక్ డౌన్లో 11.42%, మూడో లాక్ డౌన్ లో 26.59%, ప్రస్తుతం నడుస్తున్న 4వ లాక్ డౌన్ లో 39.62 శాతంగానూ ఉందని తెలియచేసారు లవ్ అగర్వాల్.
ఇది కూడా చదవండి: