India enter Twenty20 World Cup maiden final as clash against England:
సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గత రాత్రి నుంచి సిడ్నీ క్రికెట్ మైదానంలో భారీ వర్షం కురవడంతో టాస్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో భారత మహిళలు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టారు.
ఆదివారం భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు భారీ వర్షం ఇంగ్లండ్ మహిళా జట్టుకు షాక్ ఇచ్చింది.
సిడ్నీ క్రికెట్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్-ఇంగ్లండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యం అయింది. మొదటగా అంపర్లు టాస్ కోసం కట్-ఆఫ్ సమయంను నిర్ణయించారు. ఆ సమయం వరకు కూడా వర్షం తగ్గలేదు. రిజర్వ్ డే లేకపోవడంతో మ్యాచ్ను ఎట్టిపరిస్థితుల్లోనే ఈరోజే నిర్వహించాలి. ఇక 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి కూడా లేకపోవడంతో అంపర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.