Monday, May 10, 2021

Latest Posts

డబ్ల్యూహెచ్‌వో కి భారత్ నాయకత్వం

India is going to lead the WHO On the corona pestilence

ప్రపంచాన్ని  కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై   పోరులో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న వేళ భారత్‌ కి అరుదైన ఛాన్స్ లభిస్తోంది. అవును  ప్రపంచ ఆరోగ్య సంస్థలో(డబ్ల్యూహెచ్‌వో) కీలక బాధ్యతలను చేపట్టనుంది. ఇప్పటికే కరోనాపై డబ్ల్యూహెచ్‌వో సరిగ్గా వ్యవహరించలేదని,ముఖ్యంగా చైనాలో పుట్టిన ఈ వైరస్ గురించి ముందుగా హెచ్చరికలు చేయలేదని అమెరికా దేశాధినేత డోనాల్డ్ ట్రంప్ ఆరోపించడం,నిధుల్లో కోతవిధించడం,విచారణ కూడా చేపడుతున్నట్లు ప్రకటించడం తెల్సిందే.

అయితే ఈ కీలక సమయంలో భారత్ డబ్ల్యూహెచ్‌వో కి నాయకత్వం వహించబోతోంది.   మే నెలలో భారత ప్రతినిధి డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బాడీ చైర్‌పర్సన్‌గా నియమితులు కానున్నారు. ఎందుకంటే, 34 మంది సభ్యులున్న ఎగ్జిక్యూటివ్‌ బాడీకి ప్రస్తుతం జపాన్‌ అధ్యక్షత వహిస్తుండగా,  పదవీ కాలం మే నెలతో పూర్తవుతోంది.  ఇప్పటికే నిర్ణయం జరిగిన మేరకు మే 18న వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత భారత్‌ బాధ్యతలను చేప్పట్టబోతోంది.

ఎగ్జిక్యూటివ్‌ బాడీ చైర్‌పర్సన్‌ హోదాలో భారత ప్రతినిధి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌కు కీలక నిర్ణయాల్లో సహాయం, సూచనలు అందిస్తారు. ఓపక్క కొవిడ్‌పై పోరుకు సంబంధించి డబ్ల్యూహెచ్‌వోపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ… మరోపక్క అదే  సమయంలో భారత్‌ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని ప్రపంచం నుంచి మన్ననలు అందుకుంటోంది. ఇలాంటి సమయంలో డబ్ల్యూహెచ్‌వో కి భారత్ నాయకత్వం వహించడం నిజంగా కొత్త సవాల్ అంటున్నారు విశ్లేషకులు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss