Monday, January 18, 2021

Latest Posts

అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న భారత్

టెస్టు క్రికెట్‌లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ను 36 పరుగల వద్ద ముగించింది. ఇప్పటివరకు చూసుకుంటే టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 42గా ఉంది. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఈ స్కోరును నమోదు చేసింది. అయితే, మహ్మద్‌ షమీ గాయంతో ‘రిటైర్డ్‌ అవుట్’‌గా వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద 9 వికెట్లతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగించాల్సి వచ్చింది. దీంతో టీమిండియా అత్యంత తక్కువస్కోరు నమోదు చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతేకాకుండా టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరును సమం చేసింది.

టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో వంద క‌న్నా త‌క్కువ స్కోర్‌కే టీమిండియా ఐదు సార్లు ఆలౌట్ అయ్యింది. 1947లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా చేతిలో 58 చేసి ఆలౌటైంది. 1952లో మాంచెస్ట‌ర్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 58 ర‌న్స్ చేసింది. 1996లో డ‌ర్బ‌న్‌లో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో అత్య‌ల్పంగా 66 ర‌న్స్ చేసి ఆలౌటైంది. 2020 సంవ‌త్స‌రం టీమిండియాకు చేదు అనుభ‌వాన్ని మిగ్చిలింది.

4,9,2,0,4,0,8,4,0,4.. ఇవి టీమిండియా ఆటగాళ్లు నమోదు చేసిన వరుస స్కోర్లు. ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఎలా సాగిందనడానికి ఈ పరుగులే నిదర్శనం. అసలు ఆడుతుంది అంతర్జాతీయ మ్యాచ్‌ లేక గల్లీ క్రికెట్‌ అనే అనుమానం కలిగింది. ఏ ఒక్కరూ కూడా డబుల్ డిజిట్ స్కోరు నమోదు చేయలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక స్కోరు. హజెల్ వుడ్ ఐదు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీసి భారత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లీడ్ తో భారత్ ఇచ్చిన 90 పరుగుల టార్గెట్ ని ఆసీస్ మాత్రం కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఈ విజయంతో ఆసీస్ 4 మ్యాచుల టెస్ట్ సిరీస్ లో 1-0 తో ముందంజ వేసింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss