Wednesday, December 1, 2021

Latest Posts

హాకీలో చరిత్ర సృష్టించిన భారత్‌ టీమ్

India men win Olympic bronze medal at Tokyo 2020

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ 41 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. హాకీలో మరో చరిత్రకు అధ్యయనం పలికింది. గురువారం జరిగిన సెమీపైనల్ లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. సెమీస్‌లో ఓడిన హాకీ జట్టు కాంస్య కోసం జరిగిన పోరులో అదరొట్టింది. జర్మనీపై5-4 భారత్  విజయం సాధించింది. మొదట జర్మనీ జట్టు దూకుడు ప్రదర్శిస్తూ భారత్‌పై ఆధిపత్యం సాధిస్తున్నట్లు కనిపించింది. తొలి గోల్ జర్మనీయే సాధించింది. ఆ తర్వాత భారత ఆటగాడు సమర్ జిత్ గోల్ కొట్టి సమం చేశాడు. అనంతరం జర్మనీ జట్టు వరుసగా రెండు గోల్స్ సాధించడంతో 3-1 తేడాతో ఇండియన్ టీమ్ వెనకబడిపోయింది.

ఐతే ఆ తర్వాత మనోళ్లు చెలరేగిపోయారు. వరుసగా నాలుగు గోల్స్ కొట్టారు. హార్ధిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సమర్ జిత్ సింగ్ గోల్ కొట్టడంతో 3-5 లీడింగ్‌లోకి వెళ్లిపోయింది భారత్. హోరా హోరీగా సాగిన పోరాటంలో భారత్ అంతిమ విజయం సాధించింది. 1980లో మాస్కోలో ఒలింపిక్స్‌లో చివరి సారి స్వర్ణ పతకం సాధించిన సంగతి విదితమే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన ఈ విజయం భారత్‌ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss