Wednesday, April 21, 2021

Latest Posts

మాట మార్చిన ట్రంప్

India releases hydroxychloroquine stocks to USA

అమెరికా సహా కరోనాతో విలవిల్లాడుతున్న ఇతర దేశాలకు మానవతా దృక్పథంతో మందులు సరఫరా చేస్తామని భారత్‌ ప్రకటించింది. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన మూడు కంపెనీల నుంచి దాదాపు 29 మిలియన్‌ డోసుల డ్రగ్స్‌ అమెరికాకు పంపిస్తునట్లు పీటీఐ వెల్లడించింది. ఇక ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్‌.. 29 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో నేను మాత్రలు కొన్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేను మాట్లాడి వాటిని విడుదల చేయాలని కోరాను. ఆయన చాలా గొప్పవారు.

చాలా చాలా మంచి వారు అంటూ ఇవాళ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అవసరమైతే భారత్‌పై వాణిజ్యపరంగా ప్రతీకార చర్యలు ఉంటాయన్న ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చారు.  మందుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్ణయానికి ముందే ఆర్డర్‌ పెట్టినందువల్ల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయాల్సిందిగా అమెరికా విజ్ఞప్తి చేసింది అని ట్రంప్ తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss