Home రాజకీయం నిత్యవసరాలు సరఫరా చేస్తున్న రైళ్లు

నిత్యవసరాలు సరఫరా చేస్తున్న రైళ్లు

India running essential commodities in trains

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున పలు ప్రాంతాల్లో ఆహార వస్తువుల కొరత ఏర్పడింది.  దీంతో రైల్వేశాఖ దేశంలోని అన్నీ ప్రాంతాల ప్రజల అవసరాలు  తీర్చేందుకు వారికి కావలసిన వస్తువులను ఒక చోట నుండి వేరే చోటకు చేర్చడానికి రైల్వే పార్శిల్‌ వ్యాన్లను ఉపయోగిస్తునట్లు తెలిపారు. వాటి ద్వారా ప్రాజలకు కావలిసిన నిత్యవసర సరుకుల కొరత రాకుండా చెయ్యొచని తెలిపారు.

ఢిల్లీ ప్రజల అవసరాల్ని తీర్చేందుకు గాను రేణిగుంట నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌కు పార్శిల్‌ రైళ్లను ఉపయోగించి 2.4లక్షల లీటర్ల పాలను, 23టన్నుల మామిడి, 23టన్నుల పుచ్చకాయల్ని సరఫరా చేశారు. మూడు రోజుల కిందట సికింద్రాబాద్‌ నుంచి హౌరాకు కూడా  ఆహార పదార్ధాలను తరలించినట్లు చెప్పారు.  సాధారణంగా పార్శిల్‌ వ్యాన్ల రైలు గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా గంటకు 55 కి.మీ. వేగంతో నడుపుతున్నామన్నారు.

Exit mobile version