Monday, January 18, 2021

Latest Posts

రెండో టెస్టులో భారత్ ఘన విజయం

India vs Australia Second Test

ఆస్ట్రేలియా,భారత్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్‌  ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో సునాయాసంగా చేధించింది. భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, కెప్టెన్‌ అజింక్య రహానె(27), ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(35) రాణించడంతో భారత్‌ 15.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.

అడిలైడ్ టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన భార‌త్, ఈ విజయంతో మళ్ళీ తిరిగి పుంజుకుంది.  ముఖ్యంగా భార‌త బౌల‌ర్స్  విజృంభించి ఆస్ట్రేలియాని రెండు ఇన్నింగ్స్‌లలో 200 ప‌రుగులలోపే క‌ట్ట‌డి చేశారు. ఫాస్ట్ బౌలింగ్ తో బుమ్రా, సిరాజ్‌లు ఆస్ట్రేలియాని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తే అశ్విన్, జ‌డేజాలు తమ స్పిన్ మాయాజాలంతో కంగారూల‌ను హడలెత్తించారు.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ కొద్దిగా ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ, శుభ్‌మ‌న్ గిల్‌, ర‌హానే, జ‌డేజాల అద్భుత పోరాట ప‌టిమ‌తో తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేశారు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స‌రిగ్గా 200 ప‌రుగులకె కుప్ప‌కూలింది. దీనితో 70 ప‌రుగుల ల‌క్ష్యంతో లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆదిలో రెండు వికెట్లు వెంట వెంట‌నే కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగ‌ర్వాల్ (5) ప‌రుగుల‌కు ఔట్ కాగా, పుజారా(3) ప‌రుగుల‌కు పెవీలియ‌న్ బాట ప‌ట్టారు.  అయితే తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్(35) , స్టాండింగ్ కెప్టెన్ ర‌హానే(27)తో క‌లిసి ఏ మాత్రం తడబడకుండా భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు.  దీంతో 4 మ్యాచుల ఈ సిరీస్ 1-1తో స‌మం అయింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss