Monday, April 19, 2021

Latest Posts

ప్ర‌మాదంలో భారత్ – ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌

భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిందంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. ఈసారి సిరీస్ ఏ గొడ‌వా లేకుండా సాఫీగా సాగిపోతోంద‌నుకుంటే.. మూడో టెస్టు కోసం జ‌ట్టుతో క‌లిసి సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌.. పృథ్వీ షా, శుభ్‌మ‌న్ గిల్, రిష‌బ్ పంత్, న‌వ‌దీప్ సైని లాంటి కుర్రాళ్ల‌ను వెంటేసుకుని బయో బబుల్ రూల్స్ ని అతిక్ర‌మించి ఓ రెస్టారెంట్లో భోజ‌నం చేయ‌డం దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వెంట‌నే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఆ అయిదుగురిని జ‌ట్టుతో కాకుండా ఐసొలేష‌న్లో ఉండాల‌ని ఆదేశించింది.

ఈ ఉదంతంపై బీసీసీఐతో క‌లిసి చర్చిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే ఈ విష‌యంలో బీసీసీఐ త‌న ప‌వ‌ర్ చూపించి.. ఒక్క రోజులోనే పరిస్థితులను చక్కదిద్దింది. కేవలం 24 గంటల్లోనే ప్లేయర్లను ఐసోలేషన్ నుంచి తప్పించి మ‌ళ్లీ జ‌ట్టుతో కలిసి పోయేలా చేసింది. కేవలం వర్షం పడటం వల్లే ప్లేయర్స్ రెస్టారంట్ లోకి వెళ్లారని లేదంటే తిన్నగా హోటల్ కే వెళ్ళేవారని బి‌సి‌సి‌ఐ తేల్చి చెప్పింది.

అయితే బయో బబుల్ ని అతిక్ర‌మించి భార‌త జ‌ట్టు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం, త‌మ మాట‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం క్రికెట్ ఆస్ట్రేలియాకు మింగుడు పడటం లేదు. ఇకపోతే త్వరలో జరగనున్న నాలుగో టెస్టు బ్రిస్బేన్‌ ప్రాంతంలో కరోనా చెలరేగిపోతుంది. దీనితో క్వారంటైన్‌ నిబంధ‌న‌లు అత్యంత క‌ఠిన‌త‌రంగా ఉండ‌టంతో.. ఆ మ్యాచ్ అక్క‌డ ఆడ‌మ‌ని, సిడ్నీలోనే నాలుగో టెస్టు కూడా నిర్వ‌హించాల‌ని భార‌త జ‌ట్టు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇందుకు అంగీక‌రించ‌పోతే సిరీస్‌ను మధ్యలోనే వదిలి వెళ్లిపోతామని క్రికెట్ ఆస్ట్రేలియా కు హెచ్చరించింది.

మరి క్రికెట్ ఆస్ట్రేలియా ఇందుకు అంగీకరిస్తుందా, సిరీస్ సజావుగా సాగుతుందా లేక బి‌సి‌సి‌ఐ మరో సారి తన పవర్ ని నిరూపించుకుంటుందా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss