Friday, January 22, 2021

Latest Posts

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక దశలో విజయం ముంగిట నిలిచిన ఆసీస్ ను భారత బౌలర్లు వరుస వికెట్లతో చెలరేగి దెబ్బకొట్టారు. దీంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆసీస్ 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: 78 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీలు చేయడంతో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఒకానొక దశలో 152/5తో నిలిచిన భారత్ జట్టుని.. ఆరో వికెట్‌కి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా హార్దిక్ పాండ్యా- రవీంద్ర జడేజా ఆదుకుంది. ఈ జోడీ.. చివరి 7 ఓవర్లలో ఏకంగా 93 పరుగులు రాబట్టడం ద్వారా భారత్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించింది. ఇక తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss