Indian army encountered paksithan terrorists :
భారత దేశానికి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టుల ముప్పు నిరంతర ప్రక్రియగా మారిపోయింది. బోర్డుర్లో ప్రతి రోజు ఉగ్రవాదుల చొరబాట్లు నిత్యం జరుగుతున్న పరిస్థితి. పాకిస్తాన్ తన దేశంలో కరోనాతో పోరుకు చర్యలు తీసుకోకుండా భారత్ ను ఎలా దెబ్బ కొట్టాలని మాత్రమే చుస్తూండటం విచారకరం ఇటీవల కొందరు కరోనా పాజిటివ్ ఉన్న ఉగ్రవాదుల్ని పంపే ప్రయత్నం చేసింది పాకిస్థాన్. ఈ విషయాన్ని స్వయంగా ఆర్మీ అధికారులే వెల్లడించారు. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హార్డ్ కోర్ మిలిటెంట్ అసోసియేట్ ఒకడు మృతి చెందినట్టుగా పోలీసులు ధ్రువీకరించారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అవంతిపొరల్లో బోరి బోర ప్రాంతంలో భద్రతా దళాలు శనివారం తెల్లవారుజామున అక్కడ కొంత మంది ఉగ్రవాదులు ఉన్నట్టు నిర్దిష్ట సమాచారం అందుకున్నట్లుగా పోలీస్ అధికారి తెలిపారు. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో వారిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు ఇప్పుడు మరి కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుతుండడంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి మన భారత బలగాలు ఇక ఇదే తీరున గనక పాకిస్తాన్ ప్రవర్తిస్తూ ఉంటె ఆ దేశం మూడు ముక్కలయ్యే రోజులు దగ్గరపడినట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.