పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కాగా దీనికి కాను భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. ఇంతకు ముందే హిజ్బుల్ ముజాహిద్దీన్తో సంబంధాలు సాగిస్తున్న ఆ సంస్థ చీఫ్ రియాజ్ అహ్మద్ నైకును అతని సొంత ఊరులోనే హతమార్చి, భారత సైన్యం కదలికలను పసిగట్టి పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరవేసే సీనియర్ ఇనోఫ్ర్మర్ ను అదుపులోకి తీసుకుంది, తాజాగా పాకిస్తాన్ నడ్డి విరిగే మరో దెబ్బ కొట్టింది.
కాగా పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడి జనం మద్యలో సాధారణంగా వారి క్యాంపులను నెలకొల్పి వారిని అడ్డుపెట్టుకుని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఉంటారు. భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చిన ప్రతిసారి, వారు పాకిస్తాన్ పౌరులని నాటకాలు ఆడే పాకిస్తాన్ మన దగ్గర ఆట్లెరీ గన్స్ ఉండడం వలన మనకు దూరంగా తమ క్యాంపులను నెలకొల్పింది. తాజాగా జరిగిన కాల్పులలో భారత సైన్యం మిస్సైల్స్ తో క్యాంపులను గురి చేసి పేల్చేసింది. దీని ద్వారా పాకిస్తాన్ నడ్డి విరగొట్టినయ్యింది.