కశ్మీర్ లోయలో టాప్-10 మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల జాబితాను భారత భద్రతా బలగాలు 2019 లో విడుదల చేశాయి. కశ్మీర్‌లోయలో ఉగ్రవాదం తుదముట్టించేందుకు భద్రతా ఏజెన్సీలు జరుపుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ జాబితా విడుదలైంది. 2010 నుంచి హిజ్బుల్ ముజాహిద్దీన్‌తో సంబంధాలు సాగిస్తున్న ఆ సంస్థ చీఫ్ రియాజ్ అహ్మద్ నైకు పేరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
కాగా ఈ లిస్ట్ లో ఉన్న మొట్ట మొదటి టెర్రరిస్టు చీఫ్ రియాజ్ అహ్మద్ నైకును భారత సైన్యం ఇప్పటికే హతమార్చింది. కాగా అతి క్రూరూడయిన వీడిని భద్రతా దళాలు అతని సొంత ఊరులోనే హతమార్చాయి, వీడి గురించి గత కొన్ని ఏళ్లుగా సమన్వయ పరచుకుని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చినట్టు తెలిపారు. ఈ ఉగ్రవాది దక్షిణ కాశ్మీర్ లో బిగ్పోర లో ఉగ్రవాదులున్నారనే సమాచారాన్ని జమ్ము కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, CRPF జవాన్లు సంయుక్తంగా జరిపిన దాడిలో వీడు హతమయ్యాడు.