Monday, April 19, 2021

Latest Posts

తెల్లకోటు వేసుకున్న దేవుళ్ళ ను  ఇబ్బంది పెట్టొద్దు

indian doctors and nurses are fighting coronavirus:

దేశంలో ఓ పక్క కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ మరోపక్క దీనివలన ఉత్పన్నమయ్యే సమస్యల పట్ల కూడా స్పందిస్తోంది.  కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యుల ను ఇళ్ళు ఖాళీ చేయాల్సిందిగా ఇళ్ల యజమానులు వత్తిడి తెస్తున్నట్లు వార్తలు రావడంపట్ల  తీరుపై ప్రధాని నరేంద్రమోదీ  సీరియస్ గానే స్పందించారు. వైద్యులు  ‘‘తెల్లకోట్లు వేసుకున్న దేవుళ్లు’’ అని ప్రధానమంత్రి అభివర్ణించారు.

ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్న వారిని వేధించడం సిగ్గుచేటు అని ప్రధాని  తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో కొందరు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ వార్తలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘‘ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఇవాళ మనకు దేవుళ్లతో సమానం’అని పేర్కొన్నారు.

‘ఓ మహమ్మారి నుంచి వైద్యులు  మనల్ని కాపాడుతున్నారు. మనల్ని కాపాడడం కోసం వాళ్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు..’’ అని ప్రధాని పేర్కొన్నారు. అలాంటి వైద్య సిబ్బందితో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినట్టు తెలిస్తే… అలా ప్రవర్తించేవాళ్లు తప్పుచేస్తున్నారని అర్థమయ్యేలా చెప్పాలంటూ ప్రజలను కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మనకు సేవ చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి సహకరించని వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హోంశాఖను ఆదేశించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss