Saturday, February 27, 2021

Latest Posts

కరోనా ఎఫెక్ట్ :వారిని నో ఎంట్రీ

Indian Govt bans travellers from Europe country:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎఫెక్ట్ కి మరికొన్ని కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మార్చి 18 నుంచి బ్రిటన్, ఈయూ, టర్కీ దేశాల వారిని భారత్‌లోకి అనుమతించరాదని నిర్ణయించింది. అయితే ఇది ఎంత కాలం అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం కరోనా యూరప్‌లో విజృంభిస్తోంది. ఈ కారణంగా అక్కడ మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత్‌ బ్రిటన్, ఈయూ, టర్కీ దేశాలనుంచి వచ్చే యాత్రికులను అనుమతించరాదని నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో ఇప్పటివరకూ వందకుపైగా కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు వృద్ధులు మరణించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరువేల మంది చనిపోయారు. లక్షన్నర మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తనవంతు బాధ్యత తీసుకున్న ఓ నెటిజన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘‘తెలివైన నిర్ణయమంటూ’’ సదరు ట్వీట్‌ను రిట్వీట్ చేశారు.

దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఇవాళ అశు ముగ్లికర్ అనే ఓ నెటిజన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘నా సమావేశాలన్నీ రద్దు చేసుకున్నా. ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసుకు తాళం వేశాం. బిజినెస్ ప్రయాణలన్నీ నిలిపివేశా. ఒక బాధ్యతాయుతమైన యజమానిగా పౌరులు, వారి భద్రతకే నా ప్రధమ ప్రాధాన్యం. నివారణే ఉత్తమం..’’ అని పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss