Indian people facing critical situation in Malaysia
కరోనా భీబత్సంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. కాగా లాక్ డౌన్ కు ముందు విదేశాలలో చిక్కుకున్న వారి పరిస్తితి చూస్తే కన్నీళ్లు ఆగవు. మలేషియాలో చిక్కుకున్న భారతీయుల సంగతి కూడా ఇదే విదంగా ఉంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు తమిళనాడు ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ఆదుకోవలసిన అక్కడి ప్రభుత్వం తమపై అమానుషంగా ప్రవర్తిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ తమను అరెస్టు చేస్తుందని భారత ప్రభుత్వం తమని ఆడుకోవాలని కోరుతున్నారు.
కాగా మలేషియాలో మదర్ ఇండియా అనే ప్రాంతం రెడ్ జోన్ లో ఉందని అక్కడ ఎక్కువగా తెలుగు వారు, తమిళ వారు, ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారని, కాగా వీరు విజిటింగ్ వీసా మీద వచ్చారని, వారు ఈ లాక్ డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుని పోయారని, కాపాడాల్సిన ప్రభుత్వం వారిపై అమానుషంగా సంకెళ్ళు వేసి వరుసగా రోడ్లపై కూర్చోబెడుతుందని, ఇండియన్ ఎంబస్సీని ఆశ్రయించినా ఫలితం కానరాలేదని అక్కడ చిక్కుకున్న బాదితులు వాపోతున్నారు. దీనిపై వెంటనే భారత ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడ భారత ప్రజలను కాపాడవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.