Thursday, January 21, 2021

Latest Posts

కరోనా దెబ్బకు రైళ్లు రద్దు

Indian Railways cancelled multiple trains due to corona effect:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే షేర్లు పడిపోగా, పర్యాటక రంగం దెబ్బతింది. ఇక భారతీయ రైల్వేలను కూడా దెబ్బతీస్తోంది. కరోనా భయాల నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు – తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. పర్యాటక మంత్రిత్వశాఖ సూచనల మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే లక్నో- ఢిల్లీ, అహ్మదాబాద్- ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి 31 వరకు రద్దు చేయనున్నట్లు ఐఆర్‌సిటిసి తెలిపింది. ఇవే కాకుండా వారణాసి- ఇండోర్ మధ్య ఇటీవలే ప్రారంభమైన కొత్త రైలు – కాశీ-మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఏప్రిల్ 1 వరకు రద్దు చేశారు.
అయితే ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి టిక్కెట్లు తీసుకున్న ప్రయాణీకులకు వారి డబ్బు తిరిగి చెల్లిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ భయాల కారణంగా రైల్వేలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ మొత్తం 85 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లనన్నింటినీ ఏప్రిల్ 1 వరకు నిలిపేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss