Thursday, May 13, 2021

Latest Posts

నేటి నుంచి పట్టాలెక్కనున్న 15 రైళ్లు

లాక్ డౌన్  సడలింపులలో నేటినుంచి 15 ప్రత్యక రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఇప్పటికే ఆయా రైళ్ళకు స్టేషన్ లోని కౌంటర్ వద్ద కాకుండా ఐ‌ఆర్‌సి‌టి‌సి ద్వారా టిక్కెట్స్ బుక్ చేసుకొనే సదుపాయం కలిపించింది దక్షిణ  మద్య రైల్వే. ఆ రెళ్ళకు రాజధాని ఎక్స్ ప్రెస్ కు ఏవిధమైన చార్జీలు ఉంటాయో వీటికి అవే ఛార్జీలు వర్తిస్తాయి అని తెలిపింది. ఈ 15 ప్రత్యక రైళ్లలో ఒకటి సికింద్రాబాద్ నుండి ప్రారంభం కాగా మరో రెండు రైళ్లు దక్షిణమద్య  రైల్వేజోన్ లోని పలు స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

బెంగుళూరు నుండి న్యూడిల్లీ వెళ్లే 02691 నెంబరుగల రైలు ఈ రోజు (మే 12న)  సికింద్రాబాద్ మీదుగా న్యూ డిల్లీ వెళ్ళగా న్యూ డిల్లీ నుండి ఈ రోజు సికింద్రాబాద్ మీదుగా బెంగళూరుకు మరో రైలు రానున్నది. చెన్నైసెంట్రల్ నుంచి న్యూ డిల్లీ వెళ్లే రైలు ఈ నెల 15న చెన్నై నుండి బయల్దేరి విజయవాడ, వరంగల్, నాగపూర్ మీదుగా డిల్లీ వేళ్లనుంది.   అలాగే ఈ నెల 20న మద్యహనం 13.15నిమిషాలకు  సికింద్రాబాద్ నుండి డిల్లీకి ప్రత్యేక ఏసీ సూపర్ పాస్ట్ రైలు బయల్దేరానుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రధమ, ద్వితీయ, తృతీయ ఏ‌సి బోగీలు మాత్రమే ఉంటాయి. గతంలో ఇచ్చినట్టుగా దుప్పట్ట్లు , తువ్వల్లు ఈ రైల్లో ఇవ్వరు. ఐ‌ఆర్‌సి‌టి‌సిలో టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలోనే ఆహారం బుక్ చేసుకునే సదుపాయం మాత్రం కల్పించింది.

ఇది కూడా చదవండి: ఈ పరిస్థితులలో ప్యాసింజర్ రైళ్ల వద్దు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss