india’s first mobile virology lab launched in hyderabad
హైదరాబాద్ సనత్ నగర్ ఈ.ఎస్.ఐ ఆవరణలో లో ఏర్పాటు చేసిన మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ ల్యాబ్ ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సంతోష్ కుమార్ గంగ్వార్, కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, డి.ఆర్.డి.ఓ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఓ రూపొందించిన మొబైల్ వైరాలజీ రిసర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్ తో కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం మరింత పెరిగిందని, ఈ ల్యాబ్ ద్వారా ఒక్కరోజులో వెయ్యికిపైగా పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలి పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ల్యాబ్ తయారుచేయడానికి 6 నెలల సమయం పడుతుందని కానీ పదిహేను రోజులలో ఏర్పాటు చేయడం అద్భుతమని డి.ఆర్.డి.ఓ కు ఆయన అభినందనలు తెలిపారు. కరోనాతో దేశంలో విషమ పరిస్థితులు నెలకొన్నాయని ఇలాంటి సమయంలో మొబైల్ ల్యాబ్ అవసరం చాలా ఉందన్నారు. కరోనా కట్టడికి ప్రధాని మోదీ సకాలంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రక్షణ శాఖ తరపున సాయుధ బలగాలు సైతం అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.
ప్రజల సహకారంతోనే కరుణ వ్యాప్తి ఎదుర్కోవడం సాధ్యం అవుతుందని గ్రామీణ ప్రాంత ప్రజలు నో కరోనా అంటూ స్వీయ నిర్బంధం పాటిస్తుంటే పట్టణ ప్రజలు మాత్రం అవో కరోనా అంటున్నారు ఈ పద్ధతి మంచిది కాదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కరొనా ఎధుర్కోనేందుకు 304 పరీక్షా కేంద్రాలు 755 ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అవలంభిస్తోందని కేటీఆర్ తెలిపారు.