Monday, April 19, 2021

Latest Posts

పోకిరి సినిమా గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు…!

interesting facts about mahesh babu pokiri movie

మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి చిత్రం లో మహేష్ ని పోకిరిగా చూపించి పూరి కొత్త ట్రెండ్ సెట్ చేశారని చెప్పచ్చు. మహేష్ హీరోయిజం కి పూరి మేనరిజం తోడై ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు.  ‘ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు…., ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం..’అనే డైలాగ్స్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ తుడిచి పెట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఈ సినిమా. అంతేకాకుండా హీరోయిన్ ఇలియానాకు స్టార్ హీరోయిన్ హోదా ని తెచ్చి పెట్టింది. మరి ఈ సంచలన మూవీ విషయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మీకోసం… 

ఈ సినిమా స్టోరీ చెప్పటానికి మహేష్ ఇంటికి వెళ్లిన పూరి స్టోరీ మొదలుపెడుతూ… ఉత్తమ్ సింగ్ అనే ఓ పంజాబ్ కుటుంబానికి చెందిన అనాధ కుర్రాడు, మాఫియా ముఠాలలో ఉంటూ క్రైమ్స్ చేస్తూ ఉంటాడు, కట్ చేస్తే క్లైమాక్స్ లో మఫ్టీలో ఉన్న ఐ పి ఎస్ ఆఫీసర్ గా రివీల్ చేస్తాం, అని చెప్పటం జరిగిందట.  కథ మహేష్ కి బాగా నచ్చింది…. కానీ  ఆ పంజాబ్ ఫ్యామిలీ నేపథ్యం, ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ నచ్చకపోవటం తో, దానిని మార్చమని అడిగాడట మహేష్. అలాగే కథలో హీరో పాత్రకు తగినట్టుగా ఏదైనా క్యాచి టైటిల్ కావాలని కోరడం తో పూరి పోకిరి టైటిల్ చెప్పటం జరిగింది. అది మహేష్ కి విపరీతంగా నచ్చిందట. ఇకపోతే పూరీ తన భార్య లావణ్యను ముద్దుగా పిలుచుకునే పేరు “పండు” హీరో కేరెక్టర్ కి పెట్టటం జరిగింది ఈ సినిమాలో.ఇకపోతే ఈ  సినిమాను పూరి కేవలం 70 రోజుల్లేనే పూర్తి చేశారట. దాదాపు మహేష్ పై వచ్చే అన్ని సన్నివేశాలు సింగిల్ టేక్ లో ఒకే చేశాడట.

మహేష్ కి డౌట్ వచ్చి ఏంటి అన్ని సింగల్ టేక్ లో ఒకే చేస్తున్నారు అని అడగగా.. సెంకండ్ టేక్ అవసరమైతే చెవుతాను అని అన్నారట. సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎడిటింగ్ రూమ్ కి చేరుకోగా.. అక్కడ అందరూ ఈ సినిమా చూసి పెద్ద ఫ్లాప్ అవుతాదని నిర్ణయానికి వచ్చారట.  నిజానికి పోకిరి ఫస్ట్ షో తర్వాత కూడా మిక్స్డ్ టాక్ రాగా, తరువాత హిట్, కొద్దిరోజులకు సూపర్ హిట్, మరి కొన్ని రోజులకు ఇండస్ట్రీ హిట్ అన్నారు.

ఐతే పూరి మొదట ఈ సినిమా హీరోయిన్ గా  అయేషా టకియా తో పాటు, పార్వతి మెల్టన్, దీపికా పదుకొనె లను అనుకోవటం జరిగిందట. ఐతే ఎవరో దేవదాసు మూవీలో చేసిన ఇలియానాను సజెస్ట్ చేయగా పూరి ఆడిషన్స్ జరిపి ఆమెను తీసుకోవటం జరిగిందట.క్లైమాక్స్ ఫైట్ విషయానికి వస్తే… మహేష్ ప్రకాష్ రాజ్ గూబ మీద కొట్టడం తో ఆయన చెవిలో రీసౌండ్ వచ్చి ఏమి వినిపించదు. ఆ ఫైట్ లో ప్రకాష్ రాజ్ ని చూపించేటప్పుడు అతని ఫీలింగ్ ప్రేక్షకుడికి తెలిసేలా బీప్ అని సౌండ్ పెడతారు. నిజానికి ఆ ఐడియా చెప్పింది ఫైట్ మాస్టర్ విజయ్.  ఈ  ఆలోచన కి ప్రేక్షకుల నుంచి  మంచి ఆదరణ కూడా దక్కింది.ఇక చివరిగా.. పోకిరి మూవీ షూట్ సమయంలో ఫారిన్ లో గౌరీ సినిమాలో కృష్ణ గారి ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటను పోలిన ఇంగ్లీష్ సాంగ్ ని గిటార్ తో ఓ వ్యక్తి ప్లే చేయటం చూసిన పూరీ… కృష్ణ గారి ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ‘గల గల పారుతున్న గోదారి’  ని పోకిరి కోసం రీమిక్స్ చేయించటం జరిగిందట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss