Home క్రీడలు ఐ‌పి‌ఎల్ ని సస్పెండ్ చేసిన బి‌సి‌సి‌ఐ

ఐ‌పి‌ఎల్ ని సస్పెండ్ చేసిన బి‌సి‌సి‌ఐ

IPL 2021 Suspended Indefinitely After COVID Cases In Couple Of Players, IPL 2021 Suspended, IPL 2021 Suspended Indefinitely,COVID Cases, 99Telugu

IPL 2021 Suspended

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ 2021) ను సస్పెండ్ చేశారు. ఈ రోజు ఢిల్లీలో ముంబై ఇండియన్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు ముందు నిర్వహించే కోవిడ్ పరీక్షలో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీనితో ఐ‌పి‌ఎల్ 2021ని నిరంతరాయంగా సస్పెండ్ చేస్తునట్లు బి‌సి‌సి‌ఐ తెలిపింది.

కోవిడ్ కి కోచ్‌తో సహా ఇద్దరు నాన్-ప్లేయింగ్ సభ్యులు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) తమ తదుపరి మ్యాచ్ ఆడబోమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) కు తెలియజేసింది. దీనితో రేపు జరగాల్సిన మ్యాచ్ పై సంగ్దిత నెలకొంది. ఈ లోపే ఈ రోజు కూడా ఐ‌పి‌ఎల్ బృందంలో పాజిటివ్ కేసులు రావడంతో ఐ‌పి‌ఎల్ ను సస్పెండ్ చేశారు.

నిన్న జరగాల్సిన మ్యాచ్ కూడా కరోనా కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. కే‌కే‌ఆర్ ఆటగాళ్లు కరోనా టెస్ట్ లో పాజిటివ్ గా తేలడంతో కే‌కే‌ఆర్ వర్సెస్ ఆర్‌సి‌బి మ్యాచ్ ని నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి:

Exit mobile version