Sunday, June 20, 2021

Latest Posts

ఇరాన్ యొక్క అతిపెద్ద యుద్ధనౌక కథ ముగిసింది

iran’s largest navy ship sinks in gulf of oman after catching fire

నావికాదళానికి చెందిన ఇరాన్ యొక్క అతిపెద్ద యుద్ధనౌక బుధవారం ఒమన్ గల్ఫ్‌లో మునిగిపోయింది. యుద్ధనౌకలో ఉన్న అగ్నిమాపకదళ సిబ్బంది భారీ అగ్నిని కట్టడి చేయడంలో విఫలం కావడంతో ఈ నౌక మునిగిపోయింది. నౌక లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయని అయితే దానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు.

అయితే ఈ మంటలు చెలరేగినప్పుడు ఈ నౌకలో 400 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. అయితే వీరంతా ఈ నౌక నుండి సురక్షితంగా బయటపడ్డారు. కానీ 20 మంది మాత్రం గాయపడినట్లు తెలుస్తుంది.

గల్ఫ్ ఆఫ్ ఒమన్ జలసంధికి సమీపంలో టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 790 మైళ్ల దూరంలో ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో బుధవారం ఉదయం 8:30 గంటలకు ఈ నౌక మునిగిపోయింది. అయితే ఈ యుద్ధనౌకను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు 21 గంటల పాటు పోరాడారు కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే, మంటలు ఎలా వ్యాపించాయి అనే దాని పై ఇరాన్ ప్రభుత్వ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss