Home రాజకీయం కరోనా పాజిటివ్ అని తేలిన ప్రజలలో తిరిగేస్తున్న వైసీపీ నేత

కరోనా పాజిటివ్ అని తేలిన ప్రజలలో తిరిగేస్తున్న వైసీపీ నేత

Irresponsible Ycp Leader, YCP Leader Irresponsible due to Covid-19, YSRCP Leades News, AP Politics, Andhra Pradesh Latest News, Latest Updates of AP

ఏపీలో శుక్రవారం కరోనా కేసులు కొత్త రికార్డు సృష్టించాయి. గత వారంరోజులుగా భారీ స్థాయిలో కేసులు నమోదుకావడం, మరణాలు పెరిగిపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 49 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,858 కు చేరింది. అక్కడ ఇక్కడ అని లేకుండా అంతటా వ్యాపిస్తోంది. ఎంతో మంది కరోనా రక్కసికి బలైపోతున్నారు. జిల్లాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం కరోనాను లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తాజాగా కరోనా సోకిన ఓ వైసీపీ నేత వ్యాధి తీవ్రతను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమకు కరోనా వచ్చిందని తెలిసినా ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్నిరెండురోజుల క్రితం వైసీపీ నేతలు అనంతపురం జిల్లా రాయదుర్గంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతా బాగానే వుంది కానీ అక్కడే ట్విస్ట్ వుంది. ఉపేందర్‌రెడ్డికి ఈనెల 21నే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రిపోర్టు వచ్చింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండకుండా ‘జగనన్న పచ్చతోరణం‘ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉపేందర్‌రెడ్డికి కరోనా సోకిన విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో అధికారులందరూ 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలంటూ కలెక్టర్ ఆదేశించారు.

ఇది కూడా చదవండి: 

Exit mobile version