Sunday, March 7, 2021

Latest Posts

అక్షయ్ ను తీసుకుని ఇర్ఫాన్ ను తిరిగి పంపించాలట

Irrfan Khan Come Again

జనాలు ఏవిధంగా ఆలోచిస్తారో ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. దేనికి పోలిక చేస్తారో కూడా తెలీదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ మాములుగా ఉండడంలేదు . ఇలాంటిదే ఇప్పుడు బాగా వైరల్ అయింది. దీనిపై డైరెక్టర్  హరీష్ శంకర్ కూడా ట్వీట్ చేసాడు.   బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ మరణించడం  ఈ మేరకు సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది అభిమానులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈలోగా లెజెండరీ నటుడు రిషి కపూర్  తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఢీలా పడింది. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లోనూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతూ విమర్శలకు గురవుతున్నారు.

‘అక్షయ్ కుమార్ ని  తీసుకునిపోయి చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ ని తిరిగి పంపించండని’ ఓ మహిళ  ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇర్ఫాన్ మృతి పట్ల అందరూ బాధ పడుతుండగా ఇలాంటి ట్వీట్స్ విద్వేషాలను కలిగిస్తాయి. అక్షయ్ కుమార్ ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని చేసిన ట్వీట్ కి  ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మీకు అంతగా ద్వేషం కలిగేలా అక్షయ్ ఏం చేశారు. మోడికి మద్దతు చేయడం తప్పా. ఆయన కష్టపడతారు ఏడాదికి నాలుగు సినిమాలు చేసుకుంటారు. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నారు. ఆయన తన కష్టంతోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయినా సరే ఈ జనాలెందుకు ఆయన్ను అంతగా ద్వేషిస్తారు’ అని  ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ కాస్తా దర్శకుడు హరీష్ శంకర్ వద్దకు చేరడంతో ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ‘అక్షయ్ కుమార్ ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని అంటున్నారు.. అది అంత సులభమా.. ఒకవేళ అదే జరిగితే అలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు ఎంతో మంది ఆమెను తీసుకెళ్లమని అనేవారు.. మొదటగా ఆమె ఇక్కడ ఉండేది కాదు’ అని హరీష్  కౌంటర్ ట్వీట్ వేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన నెటిజన్లు ‘ఏమి ఇచ్చారు సర్ పంచ్… మీలాంటి వాళ్ళు చాలా అవసరం ఇలాంటి వక్రబుద్ధి తో ట్వీట్ పెట్టేవారికి, మానవతా విలువలు ఎక్కడికి వెళుతున్నాయో చెప్పడానికి, ఆమె చేసిన ట్వీట్ పెద్ద ఉదాహరణ’ అని కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ‘ఆమె పెట్టిన ట్వీట్ కి 114 లైక్స్ 14 రీట్వీట్స్ వచ్చాయి.. అంటే వారు కూడా అలాంటి మైండ్ సెట్ తో ఉన్నవారే.. వారిని ఆ దేవుడో కాపాడాలి’ అని  కామెంట్ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss