IS JR NTR WILL DO ONLY PAN INDIAN MOVIES AFTER RRR?
ఇక నుంచి ఎన్టీఆర్ ను కథ చెప్పి ఒప్పించడం చాలా కష్టం. చెప్పే కథలో ఒక విషయం కంపల్సరీ ఉండాలి. అది ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న RRR తర్వాత ఈ మార్పు వచ్చింది. NTR తో ఇప్పటి వరకు తెలుగులో తప్ప మరో భాషలో క్రేజ్ లేదు. కాస్తో గొప్పో కన్నడలో మంచి వసూళ్లు రాబడతాడు. జనతా గ్యారేజ్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్న, మాలీవుడ్ లో క్రేజ్ తీసుకురాలేకపోయింది. ఇక హిందీ లోకి ఇంకా అడుగుపెట్టలేదు. తమిళ అనువాదాలు నామ మాత్రమే. ఇలాంటి టైం లో ఇండియా వైడ్ రాజనౌలికి ఉన్న క్రేజ్ రీత్యా RRR తో అన్ని భాషల్లో క్రేజీ గా ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్.
RRR తర్వాత తారక్ పాన్ ఇండియా మూవీ తప్ప మరో మూవీ చెయ్యకూడదని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే యూనివర్సల్ స్టోరీ లైన్స్ ఎంచుకుంటున్నాడు. పాన్ ఇండియా సినిమాలు తియ్యడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నాడు తారక్. RRR తర్వాత ఎన్టీఆర్ దర్శకులుగా అట్లీ, ప్రశాంత్ పేర్లు వినిపిస్తున్నాయి. NTR ఇప్పటికే రెండు బడా బ్యానర్లు అయినా వైజయంతి మూవీస్, మైత్రి మూవీస్ లతో కమిట్ అయ్యాడు. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో నటించే సినిమాకు దర్శకుడిగా అట్లీ, మైత్రి మూవీస్ తో నటించే సినిమాకు దర్శకుడిగా ప్రశాంత్ పేర్లు వినిపిస్తున్నాయి.
అట్లీ త్వరలో షారుఖ్ ఖాన్ తో సినిమా తీస్తున్నాడు. ప్రశాంత్ KGF2 మూవీ తో బిజీ గా ఉన్నాడు. అయినా RRR సినిమా పూర్తి అయ్యే వరకు తారక్ మరో సినిమా చెయ్యడు. ఈలోగా ప్రశాంత్ కదా రెడీ చేసే ఛాన్స్ ఉంది. కెజిఫ్ తెలుగు, హిందీ, కన్నడలో మంచి విజయం సాధించింది. కాగా ఈ మూవీ తో ప్రశాంత్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. కాగా విజయ్ తో వరుస విజయాలు తీసిన అట్లీ షారుఖ్ ఖాన్ తో హిందీ లో అడుగు పెడుతున్నాడు. ఎన్టీఆర్ లెక్కలు చూస్తుంటే RRR తర్వాత ఇండియా వైడ్ ఎక్కువ పాపులర్ అయినా దర్శకుడితో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.