ఎన్టిఆర్, త్రివిక్రమ్ కొత్త మూవీ కి తమన్ స్వరాలు అందివ్వనున్నాడు, కాగా ముగ్గురు కూడా ఇంతక ముందు అరవింద సమేత తో సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమాలోని పాటలు కూడా తెలుగు ప్రేక్షకులను అలరించాయి. అయితే మ్యూజిక్ డైరెక్టర్లను తరచూ ప్రస్తుతం మారుస్తున్న త్రివిక్రమ్ తమన్ ను మాత్రం కంటిన్యూ చెయ్యదలచుకున్నాడు. ఇంతక ముందు త్రివిక్రమ్, DSP కాంబినేషన్ అంటే సక్సెస్ పేర్ అని ఒక నేమ్ ఉంది.
కానీ త్రివిక్రమ్ DSP ను పక్కన పెట్టి నితిన్ మూవీ అఆ కోసం మిక్కీ జె మేయర్ ను తీసుకున్నాడు. కాగా తాజా చిత్రానికి మాత్రం అదే ఈ సక్సెస్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా పట్టలేక్కనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టిఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అయ్యేంత వరకు ఇంక ఏ సినిమాను ఒప్పుకోలేదు, కాగా తన తదుపరి చిత్రం మాత్రం త్రివిక్రమ్ తో ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. ఈ కరోనా రోజులు నుంచి విముక్తి పొందిన తర్వాత నుంచి షూటింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.