Home సినిమా వార్తలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ హీరో ఎందుకంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ హీరో ఎందుకంటే?

Is Pawan Kalyan Producers Hero, Why Is Pawan Kalyan Top Hero, Pawan Kalyan Top Hero, Pawan Kalyan Is Producers Hero, Tollywood, 99Telugu

Is Pawan Kalyan Producers Hero
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అరడజను మంది వరకు వున్నారు. కానీ వారిలో ఎవరు బెస్ట్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ హీరో అయినా డబ్బులు పెట్టుబడి పెట్టే నిర్మాత గురించి ఆలోచించాలి. తను నలభై కోట్లో, యాభై కోట్లో రెమ్యూనిరేషన్ తీసుకుంటే సరిపోదు, నిర్మాత సంగతి కూడా చూడాలి. ఆ లెక్కలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో వుంటారు.

దీనికి సమాధానం వకీల్ సాబ్ సినిమా. మరే హీరో అయినా ఈ సినిమా స్టార్ కాస్ట్ అలా వుండదు. హీరోల డిమాండ్ లు, సిఫార్సులు ఓ రేంజ్ లో వుంటాయి. పది నిమషాల పాత్రకు కూడా తమకు ఫలానా హీరోయిన్ కావాలంటారు. అలాగే సినిమాలో అతి చిన్న పాత్రకు కూడా ఓ రేంజ్ ఆర్టిస్టులు కావాలంటారు. కానీ పవన్ అవేమీ పట్టించుకోలేదు. సినిమా కోర్టు సీన్లో జడ్జ్ పాత్రకు ముక్కు మొహం తెలియని నటుడిని తెచ్చినా ఆయన ఇదేంటీ అని అడగలేదు. కీలకమైన హీరోయిన్ల పాత్రలకు కూడా స్టార్ హీరోయిన్లు కావాలని అడగలేదు.

పవన్ ఇలా మంచిగా వ్యవహరించడం వల్ల నిర్మాత దిల్ రాజుకు కనీసంలో కనీసం ఓ అయిదు కోట్లు అయినా ఆదా అయి వుంటాయి. అలాగే సినిమాను మాంచి లోకేషన్లలో భారీగా తీయడం కానీ, లేదా కోర్టు సెట్ ను మాంచిగా వేయడంలో కూడా పవన్ అస్సలు పట్టించుకోలేదు. దాని వల్ల కూడా మరి కొన్ని కోట్లు ఆదా అయ్యాయి. సో పవన్ నిర్మాతల మంచి కోరే మనిషి. నిర్మాత గురించి ఆలోచిస్తేనే ఎవరైనా బెస్ట్ హీరో అవుతారని, పవన్ ఎప్పుడు బెస్ట్ అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Exit mobile version